కలం, జోగులాంబ గద్వాల: కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని గద్వాల పట్టణంలోని నదీ అగ్రహారం కృష్ణానది పుష్కర ఘాట్ (Krishna Pushkar Ghat) వద్ద మంగళవారం రాత్రి గంగా హారతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ హారతి కార్యక్రమం భక్తిశ్రద్ధలతో సాగింది. దీపాల వెలుగులతో పుష్కర ఘాట్ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి గంగా హారతిని తిలకించారు.

