Mobile Popup Ad
Mobile Popup Ad

రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు.. గాంధీభవన్‌లో సీతక్క రక్తదానం

కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఘనంగా వేడుకలు జరుగుతున్నాయి. పలు చోట్ల కాంగ్రెస్ నేతలు కేక్ కటింగ్స్, మొక్కలు నాటడం లాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో శుక్రవారం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి సీతక్క (Seethakka) స్వయంగా రక్తదానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు.

ఈ సందర్భంగా సీతక్క (Seethakka) మాట్లాడుతూ.. సమాజంలో రక్తం కొరతను తీర్చడానికి, ప్రాణాపాయంలో ఉన్నవారిని ఆదుకోవడానికి యువత, పార్టీ కార్యకర్తలు రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ ఆశయాల సాధనలో భాగంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సీతక్క పిలుపునిచ్చారు. ఈ శిబిరంలో పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>