ప్రజల ప్రాణాలు, భద్రతే ప్రభుత్వానికి ముఖ్యం : సీతక్క

కలం, వెబ్​ డెస్క్ : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో బీఆర్​ఎస్​ అవినీతి వల్లే నేడు మేడిగడ్డకు ఈ దుస్థితి ఏర్పడిందని మంత్రి సీతక్క (Minister Seethakka) విమర్శించారు. కాళేశ్వరం అంశంలో కేటీఆర్​ చేసిన వ్యాఖ్యలపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలు, భద్రతే తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమైన అంశాలు అని ఆమె చెప్పుకొచ్చారు. బీౠర్​ఎస్ కాళేశ్వరంపై రాజకీయ డ్రామాలాడుతోందన్నారు. నేసనల్​ డ్యామ్​ సేఫ్టి అథారిటి నివేదికనే ప్రభుత్వం అనుసరిస్తుందన్నారు.

నిపుణుల సూచన మేరకే నీటిని ఎత్తిపోయలేదని సీతక్క వెల్లడించారు. మేడిగడ్డ ప్రాజెక్టులో ప్రమాదం జరిగితే గోదావరి పరివాహక ప్రాంతాల్లో తీవ్ర ముంపు ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గోదావరి పరివాహక ప్రజల భద్రతపై ప్రభుత్వం రాజీపడబోదని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. కాళేశ్వరంపై చిత్త శుద్ది ఉంటే బీఆర్​ఎస్​ నేతలు నిపుణుల కమిటీ ఎదుట వాదనలు వినిపించాలని సీతక్క డిమాండ్​ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>