Mobile Popup Ad
Mobile Popup Ad

చతికిలబడిన ఇంగ్లండ్ బ్యాటింగ్.. ఆస్ట్రేలియా టార్గెట్ 151

కలం, స్పోర్ట్స్: లార్డ్స్ వేదికగా జరుగుతున్న మహిళల టీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా (ENG vs AUS) తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసినా ఇంగ్లండ్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. బ్యాటింగ్ లైనప్ అంతా పెవిలియన్‌కు క్యూ కట్టడంతో భారమంతా కెప్టెన్ నాట్ స్కివర్ బ్రంట్ భుజాలపైనే పడింది. స్కివర్ ఒంటరి పోరాటం చేస్తుండగా ఆమెకు అలైస్, ఫ్రేయ కెంప్ మంచి మద్దతు ఇచ్చారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఇంగ్లండ్ మహిళల జట్టు 4 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. ఇక ఆస్ట్రేలియా బౌలింగ్ చూస్తే.. ప్రతి బౌలర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు.

టాస్ గెలిచిన ఆస్ట్రేలియా (ENG vs AUS) ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ ఆరంభంలోనే వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ అమీ జోన్స్ కేవలం 6 పరుగులు మాత్రమే చేసింది. ఆమె లూసీ హామిల్టన్ బౌలింగ్‌లో అవుట్ అయింది. మరో ఓపెనర్ డానీ వ్యాట్-హాడ్జ్ 8 పరుగులకే వెనుతిరిగింది. ఆమెను అన్నాబెల్ సదర్‌లాండ్ అవుట్ చేసింది. ఆ తర్వాత వచ్చిన అలైస్ క్యాప్సే 23 పరుగులు జోడించింది. ఆమె సోఫీ మోలిన్యూక్స్ బౌలింగ్‌లో బౌల్డ్ అయింది. సీనియర్ ప్లేయర్ హీథర్ నైట్ కూడా నిరాశపరిచింది. ఆమె కేవలం 2 పరుగులు చేసి కిమ్ గార్త్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ అయింది. దీంతో ఇంగ్లండ్ 70 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఈ దశలో కెప్టెన్ నాట్ స్కివర్ బ్రంట్ బాధ్యతాయుతంగా ఆడింది. ఆమె మైదానంలో పాతుకుపోయి ఒంటరి పోరాటం చేసింది. సెక్సీ షాట్లతో స్కోరు బోర్డును పరుగెత్తించింది. బ్రంట్ 53 బంతుల్లో 5 ఫోర్లతో అజేయంగా 58 పరుగులు సాధించింది. ఆఖర్లో ఆమెకు ఫ్రేయ కెంప్ మంచి మద్దతు ఇచ్చింది. కెంప్ మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంది. ఆమె కేవలం 28 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 44 పరుగులు చేసింది. వీరిద్దరి భాగస్వామ్యం వల్లే ఇంగ్లండ్ కోలుకుంది. ఆసీస్ బౌలర్లలో కిమ్ గార్త్, లూసీ హామిల్టన్, సోఫీ మోలిన్యూక్స్, అన్నాబెల్ సదర్‌లాండ్ తలో వికెట్ తీశారు. రెండు బలమైన జట్ల మధ్య జరుగుతున్న ఈ పోరులో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>