కలం, మునుగోడు: పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తానని చండూరు మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు (Kodi Srinivasulu) అన్నారు. మంగళవారం చండూరు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో దసరా పండుగను పురస్కరించుకొని మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్న పారిశుధ్య కార్మికులకు దుస్తులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ డా. కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ, చండూరు (Chandaur) పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుధ్య కార్మికుల సేవలు ఎంతో కీలకమని అన్నారు. పండుగ సందర్భంగా వారికి దుస్తులు అందించడం సంతోషంగా ఉందని, వారి సంక్షేమానికి మున్సిపాలిటీ ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ ఎల్. మల్లేశం మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులు ప్రతిరోజూ అంకితభావంతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన పారిశుధ్య సేవలు అందిస్తున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ భూతరాజు దశరథ, కౌన్సిల్ సభ్యులు బుషిపాక వాసు, సామ సుజాతయాదవ రెడ్డి, కొన్రెడ్డి మధు, కోడి సుష్మ వెంకన్న, కలిమికొండ పారిజాతజనార్ధన్, కటకం రమేష్, కో-ఆప్షన్ సభ్యులు షేక్ ఖలీల్, శ్రీమతి కల్లెట్ల చంద్రకళమారయ్య, మేనేజర్ జి.రాములు, సీనియర్ అసిస్టెంట్ ఏ. సాయిభారద్వాజ్, జూనియర్ అసిస్టెంట్, ఎ. జగన్, వార్డ్ ఆఫీసర్ జి. శ్రీరాములు, బి. సాయిరాం, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ యమ్. అరవింద్ రెడ్డి, బిల్ కలెక్టర్లు, పారిశుధ్య సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

