22వ తేదీన సిద్దిపేటలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

కలం, మెదక్ బ్యూరో: ఈనెల 22వ తేదీన సిద్దిపేట (Siddipet) జిల్లా నంగునూరు మండలం నర్మెట్టలో నూతనoగా నిర్మించిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రారంభిస్తారని, ఈ సందర్భంగా మూడు రోజులపాటు రైతు మేళా నిర్వహించి వ్యవసాయ పనిముట్లను ప్రదర్శించడం జరుగుతుందని, రైతులు అధిక సంఖ్యలో పాల్గొనాల్సిందిగా మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) తెలిపారు.

రెండు, మూడు రోజుల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి సీఎం పర్యటన ఏర్పాట్ల కోసం ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని పరిశీలిస్తామని తెలిపారు. హుస్నాబాద్ (Husnabad) వ్యవసాయ మార్కెట్ కమిటీలో వ్యవసాయ యాంత్రికీకరణ పథకంలో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) చేతుల మీదుగా అక్కన్నపేట, హుస్నాబాద్, కోహెడ మండలాలకు చెందిన 38 మంది రైతులకు 53 లక్షల 80 వేల రూపాయల విలువైన 36 రోటోవేటర్లు, 2 స్ట్రాబెలర్స్ ( గడ్డిని కట్టకట్టే యంత్రాలు) వ్యవసాయ పరికరాలను 50% సబ్సిడీతో పంపిణీ చేశారు.

ఈ సందర్బంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. రైతులకు శ్రమను తగ్గించి అధిక దిగుబడులను సాధించేందుకు అమలు చేస్తున్న వ్యవసాయ యాంత్రికరణ పథకం ద్వారా వ్యవసాయ పనిముట్లను తీసుకోవాలని రైతులకు సూచించారు. వ్యవసాయంలో క్షేత్రస్థాయిలో అధికంగా ఉపయోగపడే చిన్నచిన్న పరికరాలను గత ప్రభుత్వం రైతులకు అందించలేదని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ పనిముట్లను సబ్సిడీ కింద అందిస్తుందని తెలిపారు.

Read Aslo: నల్లగొండ జిల్లాలో ఒక్క ఏడాదిలోనే రూ.600 కోట్లకు పైగా మోసం

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>