కలం, మెదక్ బ్యూరో : తెలంగాణ (Telangana) రాష్ట్ర పశుసంవర్ధక శాఖ పక్షాన రాష్ట్రంలో పశు సంపద పెంచడానికి వ్యాధులు నివారించడానికి ప్రతి ఆరు నెలలకు ఒకసారి వేసే FMD టీకా ఉచితంగా వేయడం జరుగుతుందని, వ్యవసాయానికి అనుబంధంగా పాడి పంట, ఆవులు పెంచే కార్యక్రమంను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు.
హుస్నాబాద్ (Husnabad) నియోజకవర్గం పోతారం (ఎస్) గ్రామంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణకు ఉచిత FMD టీకాలు కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనకు ఆరోగ్యాన్నిచ్చే పాల ఉత్పత్తి పెంచడానికి రైతులంతా పాడి సంపద పెంచాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం బర్రెలు, ఆవులు కొనుగోలు చేయడానికి సహకరిస్తుంది. ప్రజా పాలన ప్రభుత్వం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ చేపట్టింది. ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు.
Read Also: రెస్టారెంట్లపై వార్ ఎఫెక్ట్.. గ్యాస్ కొరతతో తీవ్ర ఇబ్బందులు
Follow Us On : WhatsApp

