Mobile Popup Ad
Mobile Popup Ad

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి : మంత్రి పొన్నం

కలం, కరీంనగర్ బ్యూరో : గ్రామాలలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా చేపట్టి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని రాష్ట్ర  రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి  పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) అధికారులను ఆదేశించారు. మంగళవారం కరీంనగర్ (Karimnagar) జిల్లా సైదాపూర్ (Saidapur) ఎంపీడీవో కార్యాలయంలో వరిధాన్యం కొనుగోలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, వేసవి తాగునీటి సమస్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, అడిషనల్ కలెక్టర్‌లు  అశ్విని తానాజీ వాకడే, రెవెన్యూ శ్రీనివాస్ రెడ్డి సహా పలువురు అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam) మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో  రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని స్పష్టం చేశారు. ధాన్యం సేకరణను వేగవంతం చేసి వెంటనే మిల్లులకు తరలించాలని, అవసరమైన వాహనాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. రైతులకు మద్దతు ధరతో పాటు కొనుగోలు అనంతరం వెంటనే చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసి గృహప్రవేశాలకు సిద్ధం చేయాలని, గ్రామాలలో  తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి తెలిపారు. పైపులైన్లు, ట్యాంక్ మరమ్మత్తులు, లీకేజీలను తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక వసతులు మెరుగుపరచాలని, విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. బడిబాట కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించి ప్రభుత్వ పాఠశాలలలో  హాజరు శాతం పెంచాలని పేర్కొన్నారు.

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని, రైతులకు ఇబ్బందులు రాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నామని తెలిపారు. గ్రామాలలో  తాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ శ్రీనివాస్ రెడ్డి, సైదాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దొంత సుధాకర్, డీఆర్డీవో శ్రీధర్, డీఎస్ఓ నర్సింగరావు, సివిల్ సప్లై డిఎం రజనీకాంత్, డిపిఓ జగదీశ్వర్, హుజురాబాద్ ఆర్డీవో రమేష్ బాబు, తహసిల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో యాదగిరి పలువురు జిల్లా అధికారులు మండలాధికారులు తదితరులు పాల్గొన్నారు.

Read Also: ‘విమానాలు ఆపేస్తాం’.. ఎయిర్‌లైన్స్ సంస్థల హెచ్చరిక

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>