Mobile Popup Ad
Mobile Popup Ad

‘విమానాలు ఆపేస్తాం’.. ఎయిర్‌లైన్స్ సంస్థల హెచ్చరిక

కలం, వెబ్ డెస్క్: పశ్చిమాసియా యుద్ధం కారణంగా దేశీయ విమానయాన రంగం (Airlines) సంక్షోభంలో పడింది. విమాన ఇంధన ధరలు భారీగా పెరిగాయని.. ఫలితంగా తమపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందని ఎయిరిండియా, స్పైసె జెట్, ఇండిగో సంస్థలు పేర్కొన్నాయి. ఎయిర్ ఫ్యూయల్‌పై విధిస్తున్న 11 శాతం ఎక్సైజ్ సుంకాన్ని వెంటనే రద్దు చేయాలని కోరాయి. తమను ఆదుకోకుంటే.. విమాన సర్వీసులను పూర్తిగా నిలిపేయడం మినహా మరో దారి లేదని తేల్చి చెప్పాయి. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు లేఖ రాశాయి.

నిర్వహణలో 40 శాతం చమురుకే..

ఫ్లైట్ల నిర్వహణలో 40 శాతం చమురు కొనుగోలుకే పోతోందని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్‌లైన్స్ (Airlines) వెల్లడించింది. జాతీయ, అంతర్జాతీయ సర్వీసులకు ఒకే తరహా విధానం పాటించాలని కోరింది. వెంటనే నిర్ణయం తీసుకోకపోతే.. సంక్షోభం తప్పదని, ఇది అంతిమంగా లక్షలాది మంది ప్రయాణికులపై ప్రభావం పడుతుందని హెచ్చరించింది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత నెలకొనుండగా, విమానయాన రంగం సైతం అదే దారిలో నడుస్తుందనే సంకేతాలు వెలువడుతున్నాయి.

Read Also: అమ్రాబాద్ అడవుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>