కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ జిల్లాలో (Karimnagar) పెట్రోల్, డీజిల్ కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందవద్దని జిల్లా అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో పెట్రోల్ బంకుల యజమానులు, గ్యాస్ డీలర్లతో సమీక్ష నిర్వహించారు. వరి కోతల నేపథ్యంలో హార్వెస్టర్లు, ధాన్యం తరలించే లారీలు, ట్రాక్టర్లకు ఎలాంటి డీజిల్ కొరత రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో గ్యాస్ సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. పెట్రోల్ బంకులు డ్రై లేకుండా చూసుకోవాలని, ఏదైనా ఇబ్బందులు ఉంటే పౌరసరఫరాల అధికారికి సమాచారం ఇవ్వాలని సూచించారు.
ఆయిల్ డిపోలో సరిపడా నిల్వలు..
రామగుండం ఆయిల్ డిపోలో సరిపడా నిల్వలు ఉన్నాయని అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలు వదంతులు నమ్మవద్దని కోరారు. ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి నర్సింగరావు, ఇండియన్ ఆయిల్ సేల్స్ ఆఫీసర్ షఫిక్, గ్యాస్ పెట్రోల్ బంకుల డీలర్లు, యజమానులు తదితరులు పాల్గొన్నారు.
Read Also: ప్రజల సమస్యలపై తప్పకుండా దృష్టి పెడతాం: ఈటల
Follow Us On: Instagram

