టీమిండియా కోచింగ్ స్టాఫ్ లో బిగ్ చేంజ్.. ఇద్దరి అవుట్!

కలం, స్పోర్ట్స్: భారత క్రికెట్ జట్టులో ప్రక్షాళన మొదలైంది. అసిస్టెంట్ కోచ్ రయాన్ టెన్ డోషేట్, ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ కు బిసిసిఐ (BCCI) బిగ్ షాక్ ఇచ్చింది. వీరిద్దరి కాంట్రాక్టులను పొడిగించబోమని స్పష్టం చేసింది. ఇటీవల ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్లలో భారత్ తీవ్రంగా విఫలమైంది. టి20, వన్డే సిరీస్ లలో ఓటములు చవిచూసింది. ఈ ప్రదర్శనపై సమీక్ష జరిపిన బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. బ్రిటన్ పర్యటనతోనే వీరి ప్రయాణం ముగిసిందని బిసిసిఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా తెలిపారు.

రయాన్ టెన్ డోషేట్ రెండేళ్ల కాంట్రాక్ట్ జూన్ 10కే పూర్తయింది. ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ గడువు జూన్ 8తో ముగిసింది. గౌతమ్ గంభీర్ చెప్పడంతో డోషేట్ టీమ్ లోకి వచ్చారు. ఫీల్డింగ్ కోచ్ పోస్ట్ ఇస్తామన్నా కేటాయించలేదు. అందుకే ఆయన నిష్క్రమించేందుకు మొగ్గు చూపారు. దిలీప్ కు ఏడాది పొడిగింపు ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. యూకే టూర్ లో ఫీల్డింగ్ ఘోరంగా ఉంది.

దాంతో పొడిగింపు ఆశలు గల్లంతయ్యాయి. ప్రస్తుతం కొత్త ఫీల్డింగ్ కోచ్ అన్వేషణ ప్రారంభమైంది. బిసిసిఐ ఇద్దరు ముగ్గురు అభ్యర్థులతో మాట్లాడుతోంది. నేషనల్ క్రికెట్ అకాడమీలో సుదీర్ఘ అనుభవం ఉన్న శుభదీప్ ఘోష్ రేసులో ముందున్నారు. ద్రవిడ్ హయాం నుంచి ఆయన ఎన్సీఏలో సేవలందిస్తున్నారు. ఆయనకే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>