చర్ల ప్రజలకు గుడ్ న్యూస్.. రూ.10.70 కోట్లతో ఆసుపత్రికి శంకు స్థాపన

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem)జిల్లాలోని చర్ల మండల ప్రజలకు అత్యాధునిక వైద్య సదుపాయాలు అందించేందుకు..  రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivasa Reddy) ఆదివారం నూతన ఆసుపత్రి భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ 30 పడకల హాస్పిటల్ అందుబాటులోకి వస్తే మారు మూల గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు స్థానికంగానే లభిస్తాయని అన్నారు.

ఏజెన్సీ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఆసుపత్రి అభివృద్ధికి ప్రభుత్వం అన్ని రకాల సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. ఆసుపత్రికి వచ్చే నిరుపేద రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ప్రైవేట్ ఆసుపత్రులకు  ధీటుగా నాణ్యమైన చికిత్స అందించాలని మంత్రి ఈ సందర్భంగా వైద్యులకు సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>