Mobile Popup Ad
Mobile Popup Ad

యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ

కలం / ఆలేరు : యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం సెలవు కావడంతో స్వామి దర్శనానికి వచ్చిన భక్తులతో యాదగిరిగుట్ట (Yadagirigutta) సందడిగా మారింది. స్వామివారి శీఘ్ర దర్శనానికి 3 గంటలు, అతిశీఘ్ర దర్శనానికి గంటకు పైగా సమయం పట్టినట్లు ఆలయ అధికారులు తెలిపారు. రెండు రోజులుగా లక్ష్మీనరసింహస్వామి కొండపైన భక్తుల రద్దీ ఎక్కువగా కనిపిస్తోంది. భారీగా తరలివచ్చిన భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. కొండపైకి వెళ్లే ఘాట్‌రోడ్డు ప్రాంతంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>