అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం సమ ప్రాధాన్యం.. మంత్రి పొంగులేటి

కలం, ఖమ్మం బ్యూరో: ప్రజా ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ రంగాలు రెండింటికీ సమ ప్రాధాన్యం ఇస్తూ, ప్రణాళికాబద్ధమైన పాలన సాగిస్తోందని మంత్రి పొంగులేటి (Minister Ponguleti) శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆదివారం ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, సీపీ సునీల్ దత్‌లతో కలిసి పొంగులేటి పాలేరు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

​ఈ పర్యటనలో భాగంగా ఏదులాపురం మునిసిపాలిటీ 23వ వార్డులో రూ. 2 కోట్ల వ్యయంతో నిర్మించనున్న గిరిజన భవన నిర్మాణానికి, కూసుమంచి మండలం మంగళితాండ గ్రామంలో రూ. 163.14 లక్షల వ్యయంతో చేపట్టనున్న బీటీ రోడ్డు పనులను ప్రారంభించారు. అలాగే జుజ్జుల్ రావుపేట గ్రామంలో రూ. 45 లక్షల అంచనాతో నిర్మించనున్న 100 కేఎల్ ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్, పైప్ లైన్ నిర్మాణ పనులకు మంత్రి భూమిపూజ చేశారు. అనంతరం మంగళితాండలో రూ. 20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. కూసుమంచిలోని తన క్యాంపు కార్యాలయంలో 30 మంది కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.

​ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని అన్నారు. ​ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న ఎల్‌నినో ప్రభావంపై మంత్రి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

దేశవ్యాప్తంగా తాగునీరు, విద్యుత్ కొరత తీవ్రంగా ఉందని, యూనిట్‌కు 15 రూపాయలు పెట్టి కొనాలన్నా కరెంట్ అందుబాటులో లేని పరిస్థితి ఏర్పడిందన్నారు. విద్యుత్ కొరత వల్ల రైతన్నలు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రాబోయే నీటి, విద్యుత్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని రైతులెవరూ ఈసారి రెండో పంట వేయవద్దని కోరారు. ​ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, ఆర్‌అండ్‌బీ బీఎస్ ఈ యుగంధర్ రావు, పీఆర్ ఎస్ఈ వెంకట్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>