కలం, వెబ్ డెస్క్: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Adluri Laxman Kumar)కు పెను ప్రమాదం తప్పింది. జగిత్యాలలో బాంకెట్హాల్ ప్రారంభోత్సవానికి ఆదివారం మంత్రి వెళ్లారు. ఈ క్రమంలోనే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ కు వెళ్తుండగా లిఫ్ట్ ఒక్కసారిగా తెగిపడింది. లిఫ్టులో మంత్రితో పాటు ఒకేసారి ఎక్కువమంది ఉండటంతో ఈ ఘటన జరిగి ఉంటుందని స్థానిక సమాచారం. స్వల్ప ఎత్తునుంచే లిఫ్ట్ తెగిపడటంతో మంత్రితో పాటు అందరికీ ప్రమాదం తప్పింది. అయితే ఒక కార్యకర్తకుస్వల్పంగా గాయాలు అయ్యాయి. తెగిపడిన లిఫ్ట్ లో సుమారు 8 మంది ఉన్నట్లు సమాచారం.
గతంలోనూ పలు సందర్భాల్లోనూ మంత్రి అడ్లూరి ప్రమాదాలకు గురయ్యారు. వెల్గటూర్ నుంచి కరీంనగర్ వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న కారు బోల్తాపడి గాయపడ్డారు. మంత్రిగా ఉన్నప్పుడు కోరుట్ల పర్యటనలోనూ ఆయనకు ప్రమాదం జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న ల్యాండ్ క్రూజర్ కారు టైరు ఊడిపోవడంతో ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. కొన్ని నెలల క్రితం కరీంనగర్ ప్రైవేట్ ఆస్పత్రిలో లిఫ్ట్ వైర్లు తెగిన ఘటనలోనూ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

