కలం, వెబ్ డెస్క్ : ప్రస్తుత రోజుల్లో స్వచ్ఛమైన ఆహారం దొరకడం గగనమైపోతోంది. నిత్యం ఏదో ఒక చోట ఆహార కల్తీ (Fake Cool Drink) ఉదంతాలు వెలుగుచూస్తుండటం సామాన్య ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. లాభార్జనే ధ్యేయంగా పెట్టుకున్న కొందరు వ్యాపారులు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. పాలు, నూనెలు, మసాలా దినుసుల నుంచి పండ్ల వరకు ప్రతి వస్తువులోనూ రసాయనాలు కలిపి విక్రయిస్తున్న తీరు విస్మయానికి గురిచేస్తోంది.
తాజాగా అపరిశుభ్ర వాతావరణంలో కల్తీ కూల్ డ్రింక్ (Fake Cool Drink) తయారీ కలకలం సృష్టిస్తోంది. కొన్ని రసాయనాలను ఉపయోగించి, పాత బాటిళ్లతో స్టింగ్ కూల్ డ్రింక్ తయారు చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. అచ్చం చూడడానికి ఒరిజనల్ స్టింగ్ కూల్ డ్రింక్ లా ఉన్న ఈ కల్తీ పానీయం తాగితే అనారోగ్య సమస్యలు తప్పవని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా పిల్లలకు ఇది అధిక ప్రమాదకరం అని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే కల్తీ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ముఖ్యంగా అపరిచితుడు వంటి సినిమాల్లో చూపించిన గరుడ పురాణ శిక్షలు ఇలాంటి నేరగాళ్లకు సరైనవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కల్తీకి పాల్పడే వారి పట్ల సానుభూతి చూపకుండా, వారి వల్ల వచ్చే అనారోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకుని చట్టాలను మరింత కఠినతరం చేయాలని జనం డిమాండ్ చేస్తున్నారు. కేవలం జరిమానాలతో సరిపెట్టకుండా, సమాజానికి గట్టి సందేశం వెళ్లేలా శిక్షలు ఉండాలని బాధితులు కోరుతున్నారు.
-మనం తాగే కూల్ డ్రింక్స్ తయారయ్యేది కెమికల్స్తోనేనా?
-కొన్ని రసాయనాలను ఉపయోగించి, పాత బాటిళ్లతో కూల్ డ్రింక్స్ తయారీ
-అచ్చం చూడడానికి ఒరిజనల్ కూల్ డ్రింక్ లా ఉన్న ఈ కల్తీ పానీయం తాగితే అనారోగ్య సమస్యలు తప్పవని నిపుణుల హెచ్చరికFake Drink Racket Busted: Chemicals and… pic.twitter.com/8gbPtoImjp
— Kalam Daily (@kalamtelugu) March 18, 2026
Read Also: వేసవి వచ్చేసింది.. వార్డ్‌రోబ్‌లో ఈ మార్పులు చేసుకోండి
Follow Us On: Instagram

