కలం, వెబ్ డెస్క్: దేవి శ్రీ ప్రసాద్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన హీరోగా నటిస్తున్న ‘ఎల్లమ్మ’ (Yellamma) మూవీ ఫస్ట్ లుక్ విడుదలైంది. ‘అతడి పేరు పర్శి, అతడి ప్రపంచం పేరు ఎల్లమ్మ’ అంటూ ఆయన పాత్రను పరిచయం చేస్తూ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ టీజర్ విడుదల చేసింది. డీఎస్పీ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ఈ చేతిలో కిరీటం పట్టుకుని ఉన్న దేవీ శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) లుక్ చిత్రంపై ఆసక్తిని మరింత పెంచుతోంది.
‘బలగం’ ఫేం వేణు యెల్దండి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో బలమైన భావోద్వేగాలు, కళల ప్రదర్శనతో కూడిన కథతో తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ వేగంగా జరుగుతోంది. గతంలో విడుదలైన టైటిల్ టీజర్‌కు మంచి స్పందన రాగా.. తాజాగా మొదటి లుక్ కూడా అంచనాలు పెంచేసింది. ఈ చిత్రాన్ని (Yellamma) దిల్ రాజు నిర్మిస్తుండగా, డీఎస్పీనే సంగీతం అందిస్తున్నారు.
Also Read : నాలో అదే చూస్తారు.. సాయి పల్లవి ఓల్డ్ కామెంట్స్ వైరల్!
Follow Us On : WhatsApp

