వరంగల్ అదాలత్ సర్కిల్‌లో ‘ప్రజా పాలన’ దినోత్సవ వేడుకలు

కలం, వరంగల్‌: తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం (Praja Palana Dinotsavam) సందర్భంగా అదాలత్‌ సర్కిల్‌లోని అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి, ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy), ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, కుడా చైర్‌పర్సన్‌ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ తదితరులు అమరవీరుల స్థూపం వద్ద పుష్పాంజలి ఘటించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>