అర్నబ్‌ తుఫాన్‌ ముప్పుపై అప్రమత్తంగా ఉండాలి: మంత్రి పొంగులేటి

​కలం, ఖమ్మం బ్యూరో: బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర తుఫాన్ ‘అర్నబ్’ (Arnab Cyclone) ప్రభావంతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు తీవ్ర అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas Reddy) సూచించారు. తుఫాన్ ప్రభావంతో వీచే ఈదురుగాలుల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు, ఆస్తినష్టం కలగకుండా తక్షణమే ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

​ఈ మేరకు ఖమ్మం జిల్లా కలెక్టర్‌ దివాకర టీ,ఎస్‌ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ అంకిత్‌తో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం ఫోన్‌లో మాట్లాడారు. ఆయా ప్రాంతాల్లోని వాతావరణ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. రెండు జిల్లాల్లోనూ అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండి, తగిన రక్షణ ఏర్పాట్లు చేయాలని సూచించారు. తుఫాన్ (Arnab Cyclone) పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలని, సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. ఎటువంటి అత్యవసర పరిస్థితి ఎదురైనా సమన్వయంతో స్పందించి, తక్షణ సహాయక చర్యలు చేపట్టేలా యంత్రాంగాన్ని సన్నద్ధం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.

Also Read : వరల్డ్ రెజ్లింగ్ టోర్నీలో సుజీత్ వేట షురూ!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>