Mobile Popup Ad
Mobile Popup Ad

ప్రతీ గ్రామాన్ని – పట్టణాన్ని అభివృద్ది చేయడమే లక్ష్యం

కలం, ఖమ్మం బ్యూరో : ఉమ్మడి ఖమ్మం b(Khammam) జిల్లాలో ఉన్న ప్రతి గ్రామాన్ని, పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలని రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఖమ్మం కలెక్టరేట్‌లో జిల్లా ఇంచార్జి మంత్రి వాకాటి శ్రీహరి (Vakiti SRIHARI) తో కలిసి ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక సన్నాహక సమావేశంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti) పాల్గొని సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న మారుమూల గ్రామాలను సైతం అభివృద్ధి చేయాలనే దృఢ సంకల్పంతో 99 రోజుల ప్రత్యేక కార్యాచరణను ప్రభుత్వం రూపొందించిందని అన్నారు. ఈ కార్యక్రమం మార్చి 6 నుంచి జూన్ 12 వరకు, శాఖల వారీగా పది ప్రధాన అంశాల అభివృద్దే లక్ష్యంగా ప్రభుత్వం పని చేయాల్సి ఉంటుందని తెలిపారు.

ఉమ్మడి జిల్లాలో ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న అటవీ, రెవెన్యూ భూముల వివాదాలను పరిష్కరించేందుకు ఈ 99 రోజుల ప్రణాళికను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి (Minister Ponguleti) సూచించారు. కొత్తగూడెం, సత్తుపల్లి, ఇల్లెందు, వైరా వంటి నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉందని, దీనివల్ల రైతులు ఇబ్బందులు పడుతుండటం తమ దృష్టికి వచ్చిందని అన్నారు. కలెక్టర్లు, డి.ఎఫ్.ఓలు మరియు రెవెన్యూ యంత్రాంగం ఉమ్మడిగా క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి, సరిహద్దులను ఖరారు చేయాలని తెలిపారు.

మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో గతంలో చేపట్టిన డ్రైనేజీ నిర్మాణాల్లో చోటుచేసుకున్న లోపాలపై మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. కొన్ని ప్రాంతాల్లో సరైన లెవల్స్ లేకపోవడం వల్ల మురుగునీరు నిలిచిపోయి ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంజనీరింగ్ విభాగం అధికారులు ప్రత్యేకంగా సమావేశమై, ఎక్కడైతే నీరు ఆగుతుందో ఆ ప్రాంతాలను గుర్తించి తక్షణమే సరిచేయాలని ఆదేశించారు. అవసరమైతే లోపభూయిష్టమైన నిర్మాణాలను తొలగించి, కొత్తగా నిర్మించాలని సూచించారు.

Read Also: విద్యార్థులకు గుడ్​న్యూస్​.. మధ్యాహ్న భోజనంలో చేపలు

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>