స్పా సెంటర్లపై పోలీసుల దాడులు.. 20 మంది అరెస్ట్

కలం, వెబ్ డెస్క్: గ్రేటర్ హైదరాబాద్‌లోని పలు ప్రధాన ఏరియాల్లో స్పా సెంటర్ల (Spa Centers) పేరుతో సాగుతున్న అసాంఘిక కార్యకలాపాలు కలకలం రేపుతున్నాయి. స్పా, వెల్‌నెస్ కేంద్రాలుగా అనుమతులు పొందుతున్న కొన్ని సెంటర్లు, లోపల రహస్యంగా వ్యభిచార గృహాలుగా మార్చేస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కూకట్‌పల్లి, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో పోలీసులు వరుస దాడులు నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లో నిర్వాహకులు ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తీసుకువచ్చి ఈ రొంపిలోకి దింపుతున్నారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో క్రాస్ మసాజ్ చేయిస్తున్న కొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ (KPHB) పోలీస్ స్టేషన్ పరిధిలోని రెండు స్పా సెంటర్లపై (Spa Centers) ఆకస్మికంగా దాడులు నిర్వహించామని ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు చేపట్టిన తనిఖీల్లో పలు ఉల్లంఘనలు గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు నిర్వహించినందుకు సంబంధించి కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.

దాడి సందర్భంగా మొత్తం 20 మందిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు తెలిపారు. నిబంధనలు అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Read Also: విద్యార్థులకు గుడ్​న్యూస్​.. మధ్యాహ్న భోజనంలో చేపలు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>