కాంగ్రెస్ గెలుపే ప్ర‌తీ కార్య‌కర్త ల‌క్ష్యం కావాలి

కలం, ఖమ్మం బ్యూరో : ప్రతి ఆడబిడ్డ ఇందిరమ్మ.. ప్రతి కార్యకర్త రేవంత్, శీనన్నలాగా శక్తి వంచన లేకుండా కృషి చేసి కొత్తగూడెం కార్పొరేషన్‌లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని.. రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి (Minister Ponguleti) తెలిపారు. కొత్తగూడెం కార్పోరేషన్‌ను సమగ్రాభివృద్ధి చేసే సత్తా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందని, అధికారం మన దగ్గర ఉంటే ప్రత్యర్థులు ఎలా అభివృద్ధి చేయగలరని ప్రతిపక్షాన్ని విమర్శించారు. ప్రభుత్వం మనది.. అధికారం మనది.. అభివృద్ధి చేసేది కూడా మనమే అని మంత్రి పొంగులేటి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. అభివృద్ది చేసే స‌త్తా మ‌న‌కే ఉంద‌ని, ప్ర‌తిప‌క్షాల మాయ మాటలు వినాల్సిన అవ‌స‌రం లేద‌ని అన్నారు.

మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో భాగంగా గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కార్పోరేషన్ (Kothagudem Corporation) లో అభ్యర్థుల విజయాన్ని కాంక్షీస్తూ సుజాతనగర్ 20, 21, 22, 23, పోస్టాఫీస్ సెంటర్ 24, 25, 26, 27, 28, 50, సింగరేణి మెయిన్ హాస్పటల్ సెంటర్ 10, 11, 12, 13, 49, హనుమాన్ షాప్ సెంటర్ గాజుల రాజం బస్తీ 55, 56, 57, 58, 59, 60 డివిజన్ల‌లో నిర్వహించిన ప్రచారంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

రెండేళ్ళ క్రితం మీ అందరి ఆశీస్సులతోనే ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. పేదల పక్షపాతిగా వారిని వెలుగులోకి తీసుకురావాలనే కోణంలోనే ఇందిరమ్మ ఇళ్ళు, సన్నబియ్యం, 200 యూనిట్ల ఉచిత కరెంటు, ఆడబిడ్డలకు ఫ్రీబస్, ఆరోగ్య శ్రీ 10 లక్షల వరకు వైద్యం, రైతు భరోసా, 2లక్షల రైతురుణ మాఫీ వంటి అనేక సంక్షేమ పథకాలను అందించగలుగుతున్నామని మంత్రి (Minister Ponguleti) పేర్కొన్నారు. ఏప్రిల్ నుంచి మళ్ళీ పేద‌ల‌కు ఇందిర‌మ్మ ఇళ్ల మంజూరు ప్రారంభం కానుంద‌ని, ఈ ప్రాంత ప్ర‌జ‌ల‌కు ఇళ్ల మంజూరు కోసం ఈ ఎన్నిక‌ల కోడ్ ముగిసిన వెంట‌నే ఆదేశాలు జారీ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.

Read Also: జ‌గిత్యాలలో స్వ‌తంత్ర అభ్య‌ర్థుల‌కు జీవ‌న్ రెడ్డి ప్ర‌చారం!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>