ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన త్రాగునీరు అందించడమే లక్ష్యం : మంత్రి నారాయణ

కలం, వెబ్ డెస్క్ : రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన త్రాగునీరు అందించడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని మంత్రి నారాయణ (Minister Narayana) తెలిపారు. పట్టణ ప్రాంతాలలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపట్టిందని ఆయన పేర్కొన్నారు. మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో రూ.14 వేల కోట్ల విలువైన టెండర్‌లు మంజూరు చేసి అభివృద్ధి పనులు వేగంగా కొనసాగిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ముఖ్యంగా త్రాగునీటి సరఫరా (Water supply) వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు, మురుగునీటి నిర్వహణపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు.

పట్టణాలలో వ్యర్థ జలాల సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు సమగ్ర మాస్టర్ ప్లాన్‌తో ముందుకు వచ్చామని ఆయన చెప్పారు. మురుగునీరు బయటికి వెళ్లే విధంగా ఆధునిక డ్రైనేజీ వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, మౌలిక వసతుల కల్పనలో ఎలాంటి రాజీ ఉండదని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>