కలం, డెస్క్ : తెలంగాణకు మాజీ సీఎం కేసీఆర్ జాతిపిత కాదని మంత్రి కోమటిరెడ్డి (Venkat Reddy) వెంకట్ రెడ్డి అన్నారు. తెలంగాణ కోసం పదవులు త్యాగం చేసిన వారంతా జాతిపితలే అంటే.. తాను మంత్రి పదవి త్యాగం చేశాను కాబట్టి తాను కూడా జాతిపితనే అని చెప్పుకోవాలి.. కానీ అది కరెక్ట్ కాదన్నారు. ‘తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ దేవత అని కేసీఆర్ స్వయంగా అన్నారు. ఇప్పుడు మాట మార్చేస్తున్నారు. తెలంగాణకు ఎవరూ జాతిపితలు లేరు.
పదేళ్ల పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేని కేసీఆర్ (KCR) జాతిపిత ఎలా అవుతారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అందరికీ రేషన్ కార్డులు ఇస్తున్నాం. తెల్ల రేషన్ కార్డు మాత్రమే కాకుండా మేం తింటున్న సన్నబియ్యమే పేద ప్రజలకు ఇస్తున్నాం. మన ప్రభుత్వం పేదలది. కాబట్టి ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీ సీట్లు ఇచ్చి మద్దతు తెలపాలని కోరుకుంటున్నా’ అంటూ తెలిపారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Venkat Reddy).
Read Also: ఇందిరమ్మ ఇండ్లపై సీఎం రేవంత్ గుడ్ న్యూస్
Follow Us On: X(Twitter)


