కలం, వెబ్ డెస్క్: మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రామ్ చరణ్ (Ram Charan) పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ విడుదల తేదీని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ భారీ చిత్రాన్ని ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు దర్శకుడు బుచ్చిబాబు సానా వెల్లడించారు. నిజానికి ఈ చిత్రాన్ని తొలుత రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా మార్చి 27న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే, సరిగ్గా అదే సమయానికి (మార్చి 26న) పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) విడుదల కానుంది. బాబాయ్ సినిమాతో పోటీ వద్దు అనుకున్నారో.. లేక టెక్నికల్ కారణాలో కానీ ‘పెద్ది’ (Peddi) టీమ్ ఆలస్యంగా ఏప్రిల్ చివరి వారాన్ని లాక్ చేసింది.
మే డే సెలవులతో పాటు సమ్మర్ సీజన్ సినిమాకు భారీ వసూళ్లను తెచ్చిపెడుతుందని మేకర్స్ భావిస్తున్నారు. తేదీని ప్రకటిస్తూ విడుదల చేసిన రామ్ చరణ్ (Ram Charan) కొత్త పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. చరణ్ మునుపెన్నడూ లేని విధంగా మాస్ లుక్‌లో కనిపిస్తుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. చరణ్ ఇంటెన్స్ లుక్ చూస్తుంటే, సినిమాలో ఆయన పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతుందో అర్థమవుతోంది. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో ఆయన ఒక గ్రామీణ యువకుడిగా కనిపించనున్నారు.
Read Also: పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్‌సింగ్ రిలీజ్ డేట్ వచ్చేసింది
Follow Us On: Sharechat


