బంగ్లాదేశ్‌లో మళ్లీ అల్లర్లు .. పోలీస్ వాహనానికి నిప్పు!

కలం, వెబ్ డెస్క్ : బంగ్లాదేశ్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు (Bangladesh Unrest) నెలకొన్నాయి. గజీపూర్ ప్రాంతంలోని ఢాకా–మైమెన్‌సింగ్ జాతీయ రహదారిపై ఈరోజు ఉదయం ఆందోళనకారులు రెచ్చిపోయారు. గజీపూర్ మెట్రోపాలిటన్ పోలీస్ అధికారికి చెందిన వాహనానికి నిరసనకారులు నిప్పు పెట్టారు.

మాజీ ప్రధాని షేక్ హసీనా సొంత జిల్లా గోపాల్‌గంజ్‌తో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా అల్లర్లు కొనసాగుతున్నాయి. నిషేధిత అవామీ లీగ్ పార్టీ మద్దతుదారులు, దాని అనుబంధ విభాగాల కార్యకర్తలు రోడ్లను దిగ్బంధించి ఆందోళనలకు దిగారు. దీంతో పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు ప్రభుత్వం భారీగా భద్రతా బలగాలను మోహరించింది. అల్లర్లకు పాల్పడుతున్న పలువురిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>