విద్య, సంస్కారం, క్రమశిక్షణపై బండి సంజయ్ కీలక సూచనలు!

కలం, కరీంనగర్: కరీంనగర్‌ (Karimnagar) లోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్‌లో విభాగ్ స్థాయి సమావేశాలు (Shishu Mandir Meeting) ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశాలకు దక్షిణ మధ్య క్షేత్ర సంఘటన మంత్రి లింగం సుధాకర్‌రెడ్డి పాల్గొని, సమావేశంలో విద్యా సంబంధిత అంశాలు, విద్యార్థుల సమగ్ర వికాసం, ఆచార్యుల బాధ్యతలు, పాఠశాలల అభివృద్ధి తదితర విషయాలపై విలువైన మార్గదర్శనం చేశారు.

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సమావేశంలో పాల్గొన్న విద్యావేత్తలతో చర్చించి విలువైన సూచనలు చేశారు. విద్యార్థుల్లో విద్యతో పాటు సంస్కారం, క్రమశిక్షణ, దేశభక్తి వంటి సద్గుణాలను పెంపొందించడంలో శిశు మందిర్ విద్యావిధానం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ముక్కాల సీతారాములు, పాక సత్యనారాయణ, నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు, ఇంజనీర్ కోల అన్నారెడ్డి, తేళ్ల రాజమౌళి, ఎలగందుల సత్యనారాయణ, బండారి కరుణాకర్, సాంబ శివరావు, కాటం రవీందర్, వివిధ పాఠశాలల ప్రతినిధులు, ఆచార్యులు, కార్యకర్తలు పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేశారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు మోర రణధీర్ తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>