కలం, హనుమకొండ: ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురికాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని పరకాల (Parakala) ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి (MLA Revuri), జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ శాఖకు సంబంధించిన ప్రజా సమస్యలు, దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టకుండా సత్వరమే పరిష్కరించాలని సూచించారు. గురువారం పరకాల ఆర్డీఓ కార్యాలయంలో వివిధ రెవెన్యూ అంశాలపై సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో వారు మాట్లాడారు. ప్రభుత్వ స్థలాలను గుర్తించి, వాటి పరిరక్షణకు అవసరమైన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. భూ రీ సర్వే ప్రక్రియను వేగవంతం చేసి నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని సూచించారు.
రెవెన్యూకు సంబంధించి ఒక్క దరఖాస్తు కూడా అనవసరంగా పెండింగ్‌లో ఉండకూడదని, ప్రతి దరఖాస్తుపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి వాస్తవాలను నిర్ధారించాలని ఆదేశించారు. దరఖాస్తుల పరిష్కార స్థితిని సంబంధిత ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని సూచించారు. సమావేశంలో ఆర్డీఓ వెంకన్న, తహసీల్దార్లు, ఇతర రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
Also Read : సోనియా పుస్తకం కాల్చేశారు.. ఎందుకంటే?
Follow Us On: X(Twitter)

