పర్సనల్‌గా టార్గెట్ చేస్తే పట్టించుకోం: నేరెళ్ల శారద

కలం, వెబ్ డెస్క్: మహిళా కమిషన్ (Women Commission) అంటే కేవలం మహిళల కోసమే కాదని ఛైర్‌పర్సన్ నేరెళ్ల శారద (Nerella Sharada) స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఆరోపణలు చేస్తే, వాటిని కమిషన్ పట్టించుకోదని వివరించారు. ఒకరిపై నిందలు వేసేముందు నిజనిజాలు పూర్తిగా తెలుసుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వీసీ అల్దాస్ జానయ్యపై మహిళా అసిస్టెంట్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో వారిద్దరినీ మహిళా కమిషన్ విచారణకు పిలిపించింది. ఇద్దరి స్టేట్మెంట్లు రికార్డ్ చేసింది.

అనంతరం ఛైర్‌పర్సన్ నేరెళ్ల శారద (Nerella Sharada) మీడియాతో మాట్లాడుతూ.. తమకు కావాల్సింది ఆరోపణలు కాదని, చెప్పిన విషయాలను ధ్రువీకరించే ఆధారాలని వివరించారు. తమకు మరికొన్ని ఆధారాలు కావాలని అడిగామని.. అనంతరమే ఈ విషయంలో ఒక స్పష్టతకు వచ్చే అవకాశం ఉందన్నారు. విచారణ పూర్తి చేసిన తరువాత ప్రభుత్వానికి నివేదిక అందిస్తామన్నారు.

వీసీ జానయ్య తనకు అభ్యంతరకరంగా మెసేజ్‌లు చేస్తూ, లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆరోపించడం సంచలనంగా మారింది. దీనిపై యూనివర్సిటీలో ఆందోళనలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే ఇద్దరిని కమిషన్ విచారణకు పిలిపించింది. అదే సమయంలో, వీసీ జానయ్య కూడా తనపై కుట్ర జరుగుతోందని.. విచారణ చేయాలని డీజీపీకి లేఖ రాశారు.

Also Read : భారత్ వ్యతిరేక శక్తుల కోసమే రాహుల్ పనిచేస్తున్నారు: కిషన్ రెడ్డి

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>