కలం, వెబ్ డెస్క్ : ఏపీ సీఎం చంద్రబాబుపై (Chandrababu) మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం బాధాకరం అన్నారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (Ramanarayana Reddy). తాజాగా ఆయన మాట్లాడుతూ.. ‘కేసీఆర్ కు చంద్రబాబు పాలన నచ్చితే ఎంత నచ్చకుంటే ఎంత. చంద్రబాబు గొప్ప విజనరీ అని ప్రపంచమంతా కీర్తిస్తోంది. ఆ విషయం కేసీఆర్ (KCR) కు తెలియదా. కూటమి ప్రభుత్వం మీద బురదజల్లే ప్రతిపక్షం ఉండటం చాలా దురదృష్టకరం.
ఏపీలో కూటమి మంచి పాలన అందిస్తోంది. 2025లో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నాం. ఎన్నో పెట్టుబడులు వస్తున్నాయి. ప్రపంచ కంపెనీలు ఏపీకి వస్తున్నాయి. నిన్న ఏడాది చివరి రోజు కూడా ఎన్నో పనులు చేశాం. ఇలాంటి పనులు ఈ కొత్త ఏడాదిలో మరిన్ని చేయబోతున్నాం’ అంటూ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి(Ramanarayana Reddy) చెప్పుకొచ్చారు.
Read Also: వాయుసేన ఏవోసీ ఇన్ చీఫ్గా సీతేపల్లి శ్రీనివాస్
Follow Us On: X(Twitter)


