వారిని అవమానించే హక్కు రేవంత్‌కు ఎవరిచ్చారు?: కేటీఆర్

కలం, వెబ్ డెస్క్ : ప్రస్తుతం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో కొందరికి కనీసం జాబ్ అప్లికేషన్ కూడా నింపడం రాదని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR ) ఫైర్ అయ్యారు. తెలంగాణ యువ ఇంజినీర్లను అవమానించే హక్కు రేవంత్‌కు ఎవరిచ్చారని నిలదీశారు. తన జీవితంలో ముఖ్యమంత్రి ఒక పోటీ పరీక్ష అయిన రాశారా? ఏదైనా ఉద్యోగానికి ఇంటర్వ్యూకు హాజరయ్యారా? అని ప్రశ్నల వర్షం కురిపించారు.

రేవంత్ వ్యాఖ్యలు ఆయన అహంకారానికి నిదర్శనమని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ యువత కృషి, ప్రతిభ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్న వేళ వారిని అవమానించేలా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఉండడం దురదృష్టకరమని తెలిపారు. వెంటనే సీఎం రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, యువ ఇంజినీర్లకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>