ORRపై రోడ్డు ప్రమాదం.. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ మృతి!

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ (Hyderabad) ఔటర్ రింగ్ రోడ్డు (ORR) పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం (ORR Accident) లో ప్రముఖ మిమిక్రీ కళాకారుడు సత్యనారాయణ(40) అక్కడికక్కడే మృతిచెందారు.

బతుకమ్మ వేడుకలు ముగించుకుని ఆయన తన కారులో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. సత్యనారాయణ ప్రయాణిస్తున్న కారును ఒక గుర్తుతెలియని వాహనం బలంగా ఢీకొట్టింది. ఆ వేగానికి ఆయన కారు అదుపుతప్పి రోడ్డు డివైఢర్‌ను బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో సత్యనారాయణకు తీవ్ర గాయాలు కావడంతో ఆయన ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కారును ఢీకొట్టి పరారైన వాహనం కోసం పోలీసులు గాలిస్తున్నారు.

15 ఏళ్ల కళా ప్రయాణం.. 2వేలకు పైగా ప్రదర్శనలు

సత్యనారాయణ కేవలం మిమిక్రీ మాత్రమే కాకుండా, వెంట్రిలాక్విజం(బొమ్మలతో మాట్లాడించే విద్య, మ్యాజిక్ రంగాల్లో కూడా విశేష నైపుణ్యం సంపాదించారు. గత 15 సంవత్సరాలుగా కళారంగంలో నిరంతరాయంగా కొనసాగుతున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల్లోని స్టేజ్ షోలు, పండుగలు, సాంస్కృతిక, ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో కలిపి ఇప్పటివరకు 2 వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చి లక్షలాది మంది ప్రేక్షకులను అలరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>