పాన్ పసిఫిక్ ఓపెన్‌లో పొహాంకోవా సంచలనం!

క‌లం, స్పోర్ట్స్‌: స్లోవేకియా యువ టెన్నిస్ ప్లేయర్ మియా పొహాంకోవా (Mia Pohankova) సంచలనం సృష్టించింది. టోరే పాన్ పసిఫిక్ ఓపెన్‌లో మాజీ ఛాంపియన్ నవోమీ ఒసాకాకు షాకిచ్చింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో 6-3, 7-5తో విజయం సాధించింది. గంటా 35 నిమిషాల పాటు సాగిన పోరులో ఒసాకాను ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 144వ స్థానంలో ఉన్న పొహాంకోవాకు ఇది కెరీర్‌లోనే అతిపెద్ద విజయం. డబ్ల్యూటీఏ 500 స్థాయి టోర్నీలో మెయిన్ డ్రాలో ఆడటం ఇదే తొలిసారి. ఈ టోర్నీలో విజయం సాధించడంతో ఆమె నాలుగోసారి టూర్ స్థాయి క్వార్టర్ ఫైనల్‌కు చేరింది.

గత ఏడాది వింబుల్డన్ జూనియర్ సింగిల్స్ టైటిల్ గెలిచిన పొహాంకోవా.. ఈ ఏడాది కూడా నిలకడగా రాణిస్తోంది. గతేడాది ఇదే సమయానికి 659వ ర్యాంకులో ఉన్న ఆమె, ఈ సీజన్‌లో ఐటీఎఫ్ డబ్ల్యూ75 టైటిల్ గెలిచింది. ఏప్రిల్‌లో డబ్ల్యూ100 టోర్నీలో రన్నరప్‌గా నిలిచింది. సెప్టెంబర్‌లో వరుసగా రెండు డబ్ల్యూటీఏ 125 టోర్నీల్లో సెమీఫైనల్స్‌కు చేరింది. వుహాన్ డబ్ల్యూటీఏ 1000 టోర్నీలోనూ రెండు విజయాలు సాధించింది.

ఒసాకాపై గెలవడంపై పొహాంకోవా సంతోషం వ్యక్తం చేసింది. ప్రత్యర్థి మంచి ఆటగాలని, ఆమెపై గెలవడం ఆనందంగా ఉందని తెలిపింది. ప్రతి పాయింట్‌పై దృష్టి పెట్టడం వల్లే విజయం సాధించగలిగానని పేర్కొంది. ఈ విజయం తన కెరీర్‌కు మంచి ఆరంభం కావాలని ఆశిస్తున్నట్లు చెప్పింది. ఇక క్వార్టర్ ఫైనల్‌లో అమెరికా ప్లేయర్ అలీసియా పార్క్స్‌తో పొహాంకోవా తలపడనుంది. మరోవైపు 2019లో టోక్యో టైటిల్ గెలిచిన ఒసాకా.. 2022 తర్వాత తొలిసారి ఈ టోర్నీలో ఆడింది. టోక్యో టోర్నీలో మూడుసార్లు ఫైనల్‌కు చేరిన ఆమెకు ఈసారి నిరాశ ఎదురైంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>