Mobile Popup Ad
Mobile Popup Ad

‘మెగా పాడ్‌కాస్ట్’.. చిరంజీవి సందడి షురూ

కలం, వెబ్ డెస్క్: వెండి తెరపై విలక్షణ పాత్రలు, అద్భుతమైన డ్యాన్సులతో అలరించిన మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) త్వరలోనే పోడ్ కాస్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దీనికి ‘మెగా పాడ్‌కాస్ట్’ (Mega Podcast) అని పేరు పెట్టారు. ఈ విషయాలను ప్రముఖ రైటర్ బి.వి.ఎస్.రవి వెల్లడించారు. చిరంజీవి పాడ్ కాస్ట్ చేయబోతున్నారని గతంలోనే ఆయన కుమార్తె సుష్మిత కొణిదెల చిన్న క్లూ ఇచ్చారు. ఇప్పుడు.. ఇది నిజమేనని తెలిసిపోవడంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. త్వరలోనే దీనిపై ప్రకటన ఉండొచ్చని సమాచారం. ఇప్పటికే, బ్యాక్‌గ్రౌండ్ వర్క్ పూర్తి కావొచ్చిందని చెబుతున్నారు.

ఎలా ఉండబోతుంది..?

ఇప్పటికే బాలయ్య ‘అన్‌స్టాపబుల్’ టాక్ షో జాతీయ స్థాయిలో ట్రెండింగ్ అయింది. ఇప్పుడు, మెగాస్టార్ (Megastar Chiranjeevi) చేయబోతున్న ఈ పాడ్ కాస్ట్ ఎలా ఉండబోతుందనేది అత్యంత ఆసక్తికరంగా మారింది. రవి వెల్లడించిన వివరాల ప్రకారం.. మెగాస్టార్ జీవితంలోని ఎవరికీ తెలియని విషయాలతో పాటు సినిమా రంగంలో ఆయనకు ఎదురైన కష్టాలు, వాటి నుంచి గట్టెక్కిన తీరుని వివరించబోతున్నారట. అంతేగాకుండా, వివిధ ఇండస్ట్రీల్లో దిగ్గజ నటులను తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేయబోతున్నారట. దీనికి సంబంధించిన వివరాలు త్వరలోనే ఓ ఈవెంట్ ద్వారా వెల్లడించే అవకాశం ఉందని టాక్.

Read Also: ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్.. ఎవరికి సేఫ్? ఎవరికి రిస్క్?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>