సీఐడీ అదుపులో ములుగు రైస్‌ మిల్లర్స్‌ అధ్యక్షుడు?

కలం, ములుగు: ములుగు జిల్లా రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కాట్రగడ్డ సతీష్‌కుమార్‌ (Katragadda Satish Kumar)ను శుక్రవారం ఉదయం సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పస్రాలోని ఆయన నివాసం నుంచి తీసుకెళ్లినట్లు చర్చ జరుగుతోంది. అక్టోబర్‌ 25న జరిగిన ఎన్నికల్లో ఆయన ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నిక కాగా, ఆరు రోజులకే ఈ పరిణామం చోటుచేసుకోవడం మిల్లర్ల వర్గాల్లో చర్చనీయాంశమైంది.

అప్పటి అధ్యక్షుడు బాదం ప్రవీణ్‌కుమార్‌తో పాటు మరో ఐదుగురు మిల్లర్లను ఇప్పటికే సీఐడీ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం గట్లకానిపర్తిలోని రెండు రైస్‌ మిల్లుల్లో సుమారు రూ.9 కోట్ల విలువైన సీఎంఆర్‌ ధాన్యం నిల్వల్లో వ్యత్యాసాలు గుర్తించారు. మరోవైపు జిల్లాలోని పది రైస్‌ మిల్లుల నుంచి 75,302 మెట్రిక్‌ టన్నుల ధాన్యానికి సంబంధించి రూ.85.09 కోట్ల విలువైన సీఎంఆర్‌ బియ్యం బకాయిలు ఉన్నట్లు పౌరసరఫరాల శాఖ వెల్లడించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>