కలం, మెదక్ బ్యూరో : సోమవారం చైర్ పర్సన్ కానుగు రాధిక భూపతి రాజ్ అధ్యక్షతన మెదక్ (Medak) మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధి గా మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనం పల్లి రోహిత్ రావ్ హాజరయ్యారు. అయితే ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన కౌన్సిలర్లు ఈ మీటింగ్ కు హాజరు కాలేదు. కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఉండడంతో అధికారిక పార్టీకి చెందిన నాయకులు కో ఆప్షన్ సభ్యులుగా ఏకగ్రీవం అయ్యారు. ఈ మేరకు రాగి వనజ, అనూష, కోర్వి రాములు, మహమ్మద్ తాహేర్ లు మెదక్ మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులుగా ఎన్నికయ్యారు.

