పంచదార్ల కొండను ‘నో మైనింగ్ జోన్‌’గా ప్రకటించిన ఏపీ

కలం, వెబ్ డెస్క్ : మైనింగ్ పై ఆంధ్రప్రదేశ్ కీలక నిర్ణయం తీసుకుంది. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలోని పంచదార్ల కొండ (Panchadarla Hill) ను నో మైనింగ్ జోన్ గా ప్రకటించింది. పంచదార్ల కొండపై అక్రమ మైనింగ్ కు సంబంధించి ఫిర్యాదు రావడంతో ప్రభుత్వం మైనింగ్ నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొండ ప్రాంతంలో మైనింగ్ కార్యకలాపాలకు అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించింది. ఆ ప్రాంతంలో 2.153 హెక్టార్ల క్వారీ మైనింగ్ లీజును రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

రాంబిల్లి, అచ్యుతాపురం, మునగపాక మండలాల్లో పంచదార్ల కొండ విస్తరించి ఉంది. గత ప్రభుత్వంలో టెండర్ తీసుకున్న సంస్థ తవ్వకాలు చేపట్టింది. ప్రభుత్వం మారిన అనంతరం కడపకు చెందిన ఓ సంస్థ క్వారీయింగ్ అనుమతి పొందారు. అయితే, పరమితికి మించి మైనింగ్ చేస్తున్నారని స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. కొండపై ఉన్న జలధారల ఉనికి ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని ఆ ప్రాంత వాసులు ఆందోళన చేశారు. దీంతో ప్రభుత్వం పంచదార్ల కొండను నో మైనింగ్ జోన్ ప్రకటించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>