కలం, వెబ్‌డెస్క్: జడ్చర్ల నియోజకవర్గ కాంగ్రెస్ (Congress) ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి (MLA Anirudh Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గానికి రావాల్సిన నిధుల కోసం ప్రభుత్వంతో అయినా కొట్లాడతానని వ్యాఖ్యానించారు. సొంత ప్రభుత్వంపైనే ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఆగిపోయాయని, చాలా పనులకు సంబంధించి బిల్లులు రావాల్సి ఉందని అనిరుధ్ రెడ్డి తెలిపారు. దీనిపై తప్పకుండా పోరాటం చేస్తానని స్పష్టం చేశారు.
ప్రజల కోసం పోరాటం చేస్తే తప్పేం లేదని అనిరుధ్ రెడ్డి అన్నారు. తనకు జడ్చర్ల (Jadcherla) ప్రజలు ఓటు వేసి గెలిపించారని, తన ప్రజలకు ఇబ్బందులు ఎదురైతే ఎవరితో అయినా కొట్లాడేందుకు సిద్ధమని ప్రకటించారు. జడ్చర్ల ప్రజల కోసం ఎందాకైనా వెళ్తానన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కొట్లాడాల్సి వస్తే ఆయనతో కూడా కొట్లాడతానన్నారు. తన నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎవరినైనా ధైర్యంగా ప్రశ్నిస్తానని స్పష్టం చేశారు.

