Mobile Popup Ad
Mobile Popup Ad

SIR కార్యక్రమంకు ప్రజలు సహకరించాలి: కలెక్టర్

కలం, మెదక్ బ్యూరో : ఎన్నికల సంఘం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 25 నుంచి జూలై 24 వరకు బూత్ లెవల్ అధికారులు బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లి ఎన్‌మరేషన్ ఫారాలను పంపిణీ చేస్తారని, ఈ ప్రక్రియలో ప్రజలు పూర్తి సహకారం అందించాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ (Medak Collector) కోరారు. మృతిచెందిన‌ వ్యక్తుల పేర్లు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదైన డూప్లికేట్ ఓట్లను గుర్తించి తొలగించడం ద్వారా మరింత ఖచ్చితమైన ఓటరు జాబితా ను రూప‌క‌ల్ప‌న చేసేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని చెప్పారు.

ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు అర్హత కలిగిన ప్రతి భారతీయ పౌరుడికి ఓటు హక్కు కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య‌ ల‌క్ష్య‌మ‌ని ఆమె (Medak Collector) స్పష్టం చేశారు. అర్హులైన ఏ ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా ఎన్నికల సంఘం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందని అన్నారు. ఓటర్ల నమోదు, సవరణలు, అభ్యంతరాలు, క్లెయిమ్స్‌కు సంబంధించిన వివరాలను సంబంధించి బూత్ లెవెల్ అధికారుల‌ను సంప్ర‌దించి తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.

పారదర్శకమైన, సమగ్రమైన, తప్పులులేని ఓటరు జాబితా రూపకల్పనలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవ‌స‌ర‌మ‌ని, మరణించిన వ్యక్తుల పేర్లు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు మారిన వారి వివరాలు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదైన డూప్లికేట్ ఓట్లను గుర్తించి తొలగించేందుకు SIR కార్యక్రమం ఉపయోగపడుతుందని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు.

Read Also : మెస్సీ 39 బర్త్‌డే.. సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయంటే!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>