ధాన్యం కొనకపోతే ఉద్యమం తప్పదు : మెచ్చా నాగేశ్వరరావు

కలం, ఖమ్మం బ్యూరో : అశ్వారావుపేట (Ashwaraopet) నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల సమస్యలు తీవ్రంగా ఉన్నాయని బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు (Mecha Nageswara Rao) ఆరోపించారు. చండ్రుగొండ మండలం దామరచర్ల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించి అక్కడ పేరుకుపోయిన ధాన్య రాశులను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన (Mecha Nageswara Rao) కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రైతులకు న్యాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, ధాన్యం కొనుగోలు ప్రక్రియలో జాప్యం వల్ల రైతులు నష్టపోతున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోలు సజావుగా జరిగేదని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలను నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. వెంటనే ధాన్యం కొనుగోలు ప్రారంభించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ వెంకట రెడ్డి, మండల బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Read Also: త్వరలోనే రెండో విడత ‘ఇందిరమ్మ’ ఇళ్ల మంజూరు: పొంగులేటి

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>