విజయానికి మూలం శ్రమ.. అభివృద్ధికి బలం కార్మికులు: మేయర్ కొలగాని శ్రీనివాస్

కలం, కరీంనగర్ బ్యూరో: ప్రతి విజయానికి మూలం శ్రమ.. ప్రతి అభివృద్ధికి బలం కార్మికులని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ (Mayor Kolagani Srinivas) అన్నారు. ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం రోజు కరీంనర్ (Karimnagar) జిల్లా కేంద్రంలోని కలెక్టరెట్ ఆడిటోరియంలో “మే డే” వేడుక ఘనంగా జరిగింది. కార్మిక, ఉపాధి, ఉత్పత్తి పరిశ్రమ శాఖల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి మేయర్ కొలగాని శ్రీనివాస్, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్ర, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలనం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కార్మికుల చట్టాలు, హక్కులు, ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై సభలో ప్రసంగించారు. ఆతర్వాత మేయర్ కొలగాని శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రా, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, అదనపు కలెక్టర్ తానాజీ వాకడే తమ చేతుల మీదుగా పలువురు ఉత్తమ ఉద్యోగులకు, కార్మీకులకు శాలువాలతో సత్కరించి అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సంస్కృతిక సారధి కళాకారుల ఆట-పాట అందరినీ ఆకట్టుకున్నాయి.

కార్మికులు సమాజానికి వెన్నెముక..

ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. శ్రమజీవుల కష్టానికి గౌరవం, గుర్తింపు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం అని అన్నారు. ఈ సందర్భంగా కార్మిక లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. కార్మికులు సమాజానికి వెన్నెముక లాంటి వారని చెప్పారు. వారి శ్రమ దేశంలో కీలకమని.. పారిశుధ్య కార్మికుల కష్టం ద్వారానే నగరాన్ని సుందరంగా ఉంచడం జరుగుతుందని అన్నారు. వేతన సవరణలో పని వేలల సడలింపులో వారి రక్షణకు ప్రభుత్వాలు అండగా ఉండాలన్నారు. పారిశుధ్య కార్మికులకు వేతన సరవణలో త్వరలోనే తమ పాలకవర్గంతో తీర్మానం చేసుకొని సీడిఎంఏ, ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి వేతనాలు పెంచేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. నేడు పారిశుధ్య కార్మికుల శ్రమవల్లే ప్రజలు ఆరోగ్యంగా జీవిస్తున్నారని చెప్పారు. కష్టం చేసిన ప్రతి చేతి విలువను గుర్తించి, సమానత్వం, న్యాయం, గౌరవం కోసం కలిసి ముందుకు సాగలన్నారు.

ప్రతి కార్మికుడి చెమట చుక్కలో సమాజ భవిష్యత్తు..

ప్రతి కార్మికుడి చెమట చుక్కలో మన సమాజ భవిష్యత్తు దాగి ఉందని శ్రీనివాస్ అన్నారు. కార్మికుల అంకితభావం, కష్టపడే మనస్తత్వం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిగా నిలవాలని సూచించారు. వ్యవస్థీకృత, అసంఘటిత కార్మికుల హక్కులను కాపాడటంలో తమ ప్రభుత్వం నిరంతరం పాటుపడుతుందని తెలిపారు. కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా నగరపాలక సంస్థ పని చేస్తుందని తెలిపారు. నగరపాలక సంస్థ ద్వారా మున్సిపల్ కార్మీకులకు 30 లక్షల ప్రమాద భీమా కూడ కల్పిస్తుందని స్పష్టం చేశారు. ఇటీవల తమ నగరపాలక సంస్థ ఎలక్ట్రిసిటీ కార్మికుడికి ప్రమాదం జరిగి హాస్పిటల్ లో చికిత్స ఖర్చును మొత్తం తమ పాలకవర్గం తీర్మాణం చేసి అందించడం జరిగిందని తెలిపారు.

కార్మికుల ఆరోగ్యం, కుటుంబ భద్రతకు ప్రభుత్వం పెద్దపీట..

మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల ఆరోగ్యం, కుటుంబ భద్రతకు పెద్దపీట వేస్తుందన్నారు. ఏటీసీ ద్వారా నైపుణ్యాలు కల్పిస్తూ జపాన్, జర్మనీ, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు వివరించారు. మ్యాన్ హోల్ లో మనుషులకు బదులు యంత్రాలు ఉపయోగించేలా చర్యలు చేపడతామని పేర్కొన్నారు. కలెక్టర్ చిత్ర మిశ్రా మాట్లాడుతూ.. అర్హులైన భవన నిర్మాణ రంగ కార్మికులను వెల్ఫేర్ బోర్డు కింద నమోదు చేయించాలన్నారు. ఆపరేషన్ ముస్కాన్ లో మాత్రమే కాకుండా తరచుగా తనిఖీలు నిర్వహిస్తూ బాల కార్మికులు లేని జిల్లాగా కరీంనగర్ ను తీర్చిదిద్దాలని వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సునీల్ రావు, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, కార్మీక, ఉపాధి ఉత్పత్తి పరిశ్రమల శాఖల అధికారులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>