కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar)లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ (Kolagani Srinivas) స్పష్టం చేశారు. కరీంనగర్ నగర పాలక సంస్థ పరిధిలోని 12వ డివిజన్ రామచంద్రపూర్ కాలనీలో రూ.17 లక్షల మున్సిపల్ సాధారణ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మేయర్ నేడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. నగరంలోని అన్ని డివిజన్లలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు అందించేందుకు సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇతర అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు.
రామచంద్రపూర్ కాలనీ ప్రజల దీర్ఘకాలిక అవసరమైన ఈ సీసీ రోడ్డు నిర్మాణం పూర్తయిన అనంతరం రాకపోకలు సులభతరం కావడంతో పాటు స్థానికులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని మేయర్ (Kolagani Srinivas) తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ వేణు, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, స్థానిక నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.
Read Also: దేశాన్ని విభజించొద్దు.. రేవంత్‌కు కేంద్ర మంత్రి కౌంటర్
Follow Us On: Sharechat

