Mobile Popup Ad
Mobile Popup Ad

ఇందిరమ్మ రాజ్యంలో పేదల సొంతింటి కల సాకారం : సర్వోత్తమ్ రెడ్డి

కలం, సూర్యాపేట: ఇండ్లు లేని ప్రతి నిరుపేదకు పక్కా ఇండ్లు కట్టించి ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతీ ఒక్కరికి దశలవారీగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి (Sarvotham Reddy) తెలిపారు. ఆదివారం చివ్వేంల మండలంలోని తుల్జారావు పేట గ్రామంలో లావురి బేబీ నాగరాజు ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. పేదల సొంతింటి కలలను కాంగ్రెస్ ప్రభుత్వం నిజం చేస్తున్నదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పని చేస్తోందన్నారు.

ఎన్నో సంవత్సరాలుగా సొంతిల్లు లేక అద్దె ఇళ్లలో ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు ఇప్పుడు ఇంద్రమ్మ ఇళ్ల పథకం ద్వారా గౌరవప్రదమైన జీవనం అందుతోందన్నారు. ఇల్లు అనేది ప్రతి కుటుంబానికి ఒక భద్రత, ఒక ఆత్మగౌరవం. ఆ గౌరవాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పేద కుటుంబానికి అందించేందుకు కట్టుబడి ఉంది అని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల మంజూరు ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఇల్లు లేని నిరుపేదల జీవితాల్లో వెలుగు నింపుతున్నామని తెలిపారు.

అర్హులైన ప్రతి పేద కుటుంబానికి దశలవారీగా ఇళ్లు అందజేస్తూ సొంతింటి కలలను నిజం చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని స్పష్టం చేశారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సమాన ప్రాధాన్యతతో ఇళ్ల నిర్మాణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాసంక్షేమ పథకాలు మహిళల ఆర్థిక సాధికారత కోసం మహాలక్ష్మి పథకం, రైతులకు రైతు భరోసా, ఉచిత విద్యుత్, గృహ వినియోగదారులకు 200 యూనిట్ల ఉచిత కరెంట్, రూ.500కే గ్యాస్ సిలిండర్, యువతకు ఉపాధి అవకాశాలు వంటి పథకాలు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువస్తున్నాయని అన్నారు.

ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా ప్రతి హామీని అమలు చేస్తున్నామని, పేదల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయమని సర్వోత్తమ్ రెడ్డి స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మరింత వేగంగా కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు మొరిశెట్టి లక్షాది, చివ్వేంల మండల పార్టీ అధ్యక్షుడు ధారవత్ వీరన్న నాయక్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ చెన్నోజు నర్సింహా చారి, గ్రామా శాఖ అధ్యక్షుడు పత్తిపాక వెంకటేశ్వర్లు, ఉప సర్పంచ్ మురారి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>