కలం, నల్లగొండ: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టింటి పట్టుచీరలు లాగా మహిళలందరికీ ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తున్నారని నల్గొండ (Nalgonda) మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి (Mayor Burri Chaitanya Srinivas Reddy) అన్నారు. ‘ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా సోమవారం జిల్లాలోని చర్లపల్లిలో చీరలు పంచారు. 15వ డివిజన్ హైస్కూల్ వద్ద, 16వ డివిజన్ బీసీ కాలనీలో స్థానిక కార్పొరేటర్లతో కలిసి ఇందిరమ్మ మహిళా శక్తి కింద మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మేయర్ బుర్రి చైతన్య మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభివృద్ధికి పెద్దపీట వేసిందని అన్నారు. మహిళా సంఘాల ద్వారా ప్రభుత్వం మహిళల ఆర్థిక అభివృద్ధికి వడ్డీ లేని రుణాలను అందజేస్తుందని తెలిపారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ లోని అన్ని డివిజన్లలో అర్హులైన మహిళలందరికీ ఇందిరమ్మ చీరలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పెరిక స్వాతి వినాయక రాజు, దొడ్డి రమేష్, వార్డు అధికారులు, ఆర్పీలు, కందుల ఎల్లేష్, శంకరప్ప, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

