లాస్ వేగాస్‌లో వెర్‌స్టాపెన్ విక్టరీ.. రస్సెల్‌కు కౌంటర్

క‌లం, స్పోర్ట్స్: లాస్ వేగాస్ రేసులో రెడ్ బుల్ డ్రైవర్ మాక్స్ వెర్‌స్టాపెన్ (Max Verstappen) అద్భుత విజయం సాధించాడు. రేసు ముగిసిన వెంటనే మెర్సిడెస్ డ్రైవర్ జార్జ్ రస్సెల్‌పై వెర్‌స్టాపెన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. రస్సెల్ తన స్థాయికి ఏమాత్రం సరిపోడని ఘాటుగా వ్యాఖ్యానించాడు.ఈ వివాదం మూడో ప్రాక్టీస్ సెషన్‌లో మొదలైంది. టర్న్ 14 వద్ద వీరిద్దరి కార్లు ఢీకొన్నాయి. వెర్‌స్టాపెన్ నిర్లక్ష్యంగా డ్రైవ్ చేశాడంటూ నిర్వాహకులు హెచ్చరిక జారీ చేశారు. దీనిపై స్పందించిన రస్సెల్, వెర్‌స్టాపెన్ అందరికంటే తానే గొప్పవాడినని ప్రవర్తిస్తున్నాడని విమర్శించాడు.

ఆ తర్వాత జరిగిన 50 ల్యాప్‌ల ప్రధాన రేసులో వెర్‌స్టాపెన్ తన నైపుణ్యంతో ఈ సీజన్‌లో నాలుగో విజయాన్ని అందుకున్నాడు. లాండో నోరిస్, ఆస్కార్ పియాస్ట్రీ రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. రెండో స్థానం కోసం సహచర డ్రైవర్ కిమీ ఆంటోనెల్లిని దాటే ప్రయత్నంలో రస్సెల్ కారు బారియర్‌ను ఢీకొట్టింది. దీంతో రస్సెల్ తొమ్మిదో స్థానానికి పడిపోయాడు. రేసు అనంతరం వెర్‌స్టాపెన్ మీడియాతో మాట్లాడాడు. రస్సెల్ ట్రాక్ బయట ఎక్కువగా మాట్లాడుతుంటాడని, తన స్థాయికి అతను చాలా తక్కువ కావడంతో ఆ మాటలను పట్టించుకోనని అన్నాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>