కలం, వెబ్ డెస్క్: నేపాల్ ప్రధాని బాలేంద్ర షా (Balendra Shah) రెండు రోజుల పర్యటన కోసం ఢిల్లీకి చేరుకున్నారు. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు ఆయన భారత్‌కు వచ్చారు. బాలేంద్ర షా ఈ ఏడాది మార్చిలో ప్రధాని బాధ్యతలు చేపట్టిన తరువాత ఇండియాకు రావడం ఇదే తొలిసారి. ఢిల్లీ విమానాశ్రయంలో ఆయనకు కేంద్ర మంత్రి జితన్ ప్రసాద్ సాదర స్వాగతం పలికారు.
ఈ పర్యటనలో భాగంగా బాలేంద్ర షా సోమవారం మోదీతో సమావేశమై.. ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. అంతేగాకుండా ఇద్దరు ప్రధానులు వర్చువల్‌గా కొన్ని ప్రాజెక్టులను కూడా ప్రారంభించబోతున్నారు. ఎనర్జీ, హైడ్రో పవర్, రైల్వేలు, వాతావరణ మార్పులు, విపత్తు నిర్వహణ, మౌలిక వసతులు, టెక్నాలజీ వంటి రంగాల్లో ఒప్పందాలు కుదుర్చుకోబోతున్నారు. రెండు దేశాల మధ్య సమస్యాత్మకంగా ఉన్న ప్రాంతాలపై కూడా చర్చించే అవకాశం ఉంది.
రెండు పుణ్యక్షేత్రాల మధ్య రైలు..
భారత్‌లోని అయోధ్య, నేపాల్ దేశంలోని జనకపురి ధామ్ మధ్య త్వరలోనే రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. రామాయణం ప్రకారం, అయోధ్య శ్రీరాముడి జన్మస్థానం కాగా, జనకపురి సీతమ్మ స్వస్థలం. రెండు పవిత్ర పుణ్యక్షేత్రాలను కలుపుతూ ప్రారంభయ్యే రైలు.. ఇరు దేశాల సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని ఇప్పటికే ప్రధానులు ప్రకటించారు. ఇప్పటికే నవంబర్ 5న ట్రయల్ రన్ కూడా పూర్తి చేశారు.

