Mobile Popup Ad
Mobile Popup Ad

కాంగ్రెస్ మహిళా వ్యతిరేక పార్టీ : నాగం వర్షిత్ రెడ్డి

కలం, నల్లగొండ బ్యూరో : కాంగ్రెస్ పార్టీకి మహిళల ఓట్లు కావాలి తప్ప, వారికి హక్కులు కల్పించే మనసు లేదని నల్లగొండ బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి (Nagam Varshith Reddy) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న ద్వంద్వ వైఖరిని నిరసిస్తూ శనివారం నకిరేకల్ (Nakrekal) పట్టణ కేంద్రంలో బీజేపీ శ్రేణులు భారీ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ దిష్టి బొమ్మను దహనం చేసి నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ.. మహిళా సాధికారతకు అడ్డుగా నిలుస్తున్న కాంగ్రెస్ పార్టీ అసలు స్వరూపం బయటపడిందని విమర్శించారు. మహిళలకు న్యాయం చేయని పార్టీగా కాంగ్రెస్ చరిత్రలో నిలిచిపోతుందని, వారి రాజకీయ కుట్రలను దేశంలోని మహిళా లోకం గమనిస్తోందన్నారు.

మహిళల అభివృద్ధి కోసం ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటుంటే, వాటిని అడ్డుకోవడం కాంగ్రెస్‌కు పరిపాటిగా మారిందని ధ్వజమెత్తారు. మహిళా రిజర్వేషన్ల అమలుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, మహిళలు సామాజికంగా, రాజకీయంగా ఎదిగేందుకు బీజేపీ నిరంతరం కృషి చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. మహిళా వ్యతిరేక రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు త్వరలోనే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. మహిళల హక్కుల కోసం బీజేపీ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన ప్రకటించారు. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నకిరేకల్ (Nakrekal) పురవీధుల్లో నిరసన తెలిపారు. మహిళా బిల్లు విషయంలో కాంగ్రెస్ పార్టీ తన పంథాను మార్చుకోకపోతే రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని బీజేపీ నేతలు హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ నాయకులు, పెద్ద సంఖ్యలో మహిళా కార్యకర్తలు, యువమోర్చా నేతలు పాల్గొన్నారు.

Read Also: జాతినుద్దేశించి మోదీ ప్రసంగం : ‘బిల్లు’పై కీలక వ్యాఖ్యలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>