కలం, వరంగల్ బ్యూరో : జనగణనలో భాగంగా చేపట్టనున్న నివాస గృహాల లెక్కింపును కచ్చితత్వంతో, పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ చాహాత్ బాజ్ పాయ్ (Collector Chahat Bajpai) సూచించారు. శనివారం హనుమకొండ (Hanumakonda)లోని చైతన్య డిగ్రీ, పీజీ కళాశాలలో ఈ నెల 18 నుంచి 21 వరకు నిర్వహించనున్న గృహ జనగణన మొదటి విడత (హౌస్ లిస్టింగ్) సర్వేకు సంబంధించి ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్ల శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించిన ఆమె సమర్ధ నిర్వహణకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కేటాయించిన బ్లాక్‌ల ప్రకారం ప్రతి ఇంటికి సంబంధించిన వివరాలను సమగ్రంగా నమోదు చేయాలని ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు సూచించారు.
సేకరించే సమాచారం పూర్తిస్థాయిలో, ఖచ్చితంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. జనగణన ప్రక్రియను సాఫీగా నిర్వహించేందుకు బిల్ కలెక్టర్లు, వార్డు అధికారులు, జవాన్లు, ఆర్పీలు సహకరిస్తారని తెలిపారు. శిక్షణ పూర్తయిన వెంటనే బ్లాక్‌ల వారీగా గణన ప్రక్రియను ప్రారంభించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిడబ్లుఎంసి ఆదనవు కమిషనర్ చంద్రశేఖర్, కాజీపేట డిప్యూటీ కమిషనర్ బిర్రు శ్రీనివాస్, పర్యవేక్షకులు సంతోష్, ట్రైనర్లు, ఎన్యుమరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.
Read Also: జాతినుద్దేశించి మోదీ ప్రసంగం : ‘బిల్లు’పై కీలక వ్యాఖ్యలు
Follow Us On: Pinterest

