భారత్ భయం.. మసూద్ అజర్ పరార్!

కలం, వెబ్ డెస్క్: భారత్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు మసూద్ అజర్ (Masood Azhar), హఫీజ్ సయీద్ సురక్షిత స్థావరాలకు వెళ్లినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ లోని వివిధ ప్రాంతాల్లో ఉంటున్న ఉగ్రవాదులను ఇటీవల కాలంలో గుర్తు తెలియని వ్యక్తులు నిశ్శబ్ధంగా వచ్చి, కాల్చేసి వెళ్లిపోతున్నారు. వీరి వెనుక భారత్ ఉందని భయపడుతున్న ఇద్దరు.. పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ సూచనల మేరకు కొత్త ప్రదేశాలకు పరారైనట్లు భారత నిఘా వర్గాలకు స్పష్టమైన సమాచారం అందింది.

జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థకు మసూద్ అజర్, లష్కరే తొయిబా సంస్థకు హఫీజ్ సయీద్ నేతృత్వం వహిస్తున్నారు. కశ్మీర్‌లో కొన్నేళ్లుగా రక్తపాతం పారిస్తున్న ఈ ఇద్దరు నరహంతకులు.. పీవోకేలో ఉంటూ నిత్యం ఉగ్రవాదులను భారత్‌పైకి పంపిస్తున్నారు. ఇందుకు సంబంధించి అనేక సాక్ష్యాలను పాకిస్థాన్‌కు అందించినా.. వారిని ఆర్మీ రక్షణలో ఉంచుతూ కాపాడుతూ వస్తోంది.

ఎక్కడికి వెళ్లారంటే..

భారత నిఘా వర్గాల సమాచారం ప్రకారం, హఫీజ్ సయీద్ లాహోర్ నుంచి రావల్పిండిలోని ఆర్మీ ప్రధాన కార్యాలయం సమీపంలోకి మారినట్లు తెలుస్తోంది. మసూద్ అజర్ సింధ్ ప్రావిన్స్ ప్రాంతానికి వెళ్లిపోయాడు. వీరిద్దరు ఫోన్ కాల్స్ మాట్లాడటం తగ్గించడంతో పాటు తమ అనుచరులు, కార్యకర్తలను కూడా కలవడం లేదని సమాచారం. వారి ముసుగులో అనుమానాస్పద వ్యక్తులు తమకు ప్రాణహాని తలపెట్టే అవకాశం ఉందని భయపెడుతున్నట్లు కొన్ని నివేదికలు కూడా చెబుతున్నాయి. ఆపరేషన్ సిందూర్ సమయంలో వీరిని భారత్ లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినా.. తృటిలో తప్పించుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>