కలం, తెలంగాణ బ్యూరో : మావోయిస్టు పార్టీలో వివిధ స్థాయిల్లోని లీడర్లు, కేడర్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో లొంగిపోయారు (Maoists Surrender). గత నెల చివరివారంలో నలుగురు అగ్రనేతలు లొంగిపోయిన తర్వాత ఇప్పుడు ఈ సరెండర్ ప్రక్రియ ప్రాధాన్యతను సంతరించుకున్నది. 130 మంది ఆయుధాలతో సహా లొంగిపోవడం రాష్ట్రంలోనే ఫస్ట్ టైమ్. మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ సభ్యుడు దేవ్‌జీకి ప్రొటెక్షన్ టీమ్‌గా ఉన్న సభ్యులతో పాటు ఆయన ఆధ్వర్యంలో ఇంతకాలం నడిచిన పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (PLGA)కి చెందినవారు కూడా ఉన్నారు. ప్రభుత్వానికి అప్పగించిన ఆయుధాల్లో లైట్ మెషీన్ గన్, ఏకే-47, ఎస్ఎల్ఆర్, ఇన్సాస్, 0.303 రైఫిల్స్, గ్రెనేడ్ లాంచింగ్ రైఫిల్స్ తదితరాలు ఉన్నాయి. ఇప్పటివరకూ మావోయిస్టులు డీజీపీ సమక్షంలో లొంగిపోగా మొదటిసారి ముఖ్యమంత్రి సమక్షంలో లొంగిపోవడం గమనార్హం. లొంగిపోయినవారిలో విప్లవ రచయితల సంఘం చలసాని ప్రసాద్ కుమార్తె నవత కూడా ఉన్నారు. దీర్ఘకాలంలో ఆంధ్ర-ఒడిశా బార్డర్ కమిటీ ప్రాంతంలో పనిచేసిన ఆమె ప్రస్తుతం ఏఓబీ స్టేట్ కమిటీ సభ్యురాలిగా ఉన్నారు. ఈ కమిటీ కార్యదర్శి మోడెం బాలకృష్ణ ఇటీవలే ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడు.
అమిత్ షా తో చర్చల తర్వాత రిజల్ట్ :
కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) తో నాలుగు రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డీజీపీ శివధర్‌రెడ్డి, అదనపు డీజీ విజయకుమార్, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఐజీ సుమతి తదితరులంతా ఢిల్లీలో సమావేశమైన తర్వాత తెలంగాణలో భారీ సంఖ్యలో వెపన్స్ తో సహా మావోయిస్టు కేడర్ లొంగిపోవడం (Maoists Surrender) గమనార్హం. వీరంతా గతంలో దేవ్‌జీకి, బడే చొక్కారావు తదితరులకు ప్రొటెక్షన్ టీమ్‌గా వ్యవహరించినవారు. వారి ఆధ్వర్యంలో వివిధ దళాలు, పీఎల్‌జీఏ టీమ్‌లలో పనిచేసినవారు. దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి, బడే చొక్కారావు, నూనె నర్సింహారెడ్డి తదితరులు గత నెలలో లొంగిపోయినప్పుడు వారి ప్రొటెక్షన్ టీమ్ సభ్యులు ఏమయ్యారనే ప్రశ్నలు తలెత్తాయి. వారి ఆయుధాలు ఏమయ్యాయనే చర్చలూ జరిగాయి. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు భారీ సంఖ్యలో ఆయుధాలు అప్పగించి లొంగిపోవడం గమనార్హం.
Read Also: మళ్లీ మూతపడ్డ దుబాయ్ ఎయిర్ పోర్ట్..!
Follow Us On: X(Twitter)

